‘దాదా’ నేతృత్వంలో భారత క్రికెట్‌ ముందుకెళ్తుంది

Indian Cricket Will Continue to Prosper Under Sourav Ganguly - Sakshi

వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆశాభావం

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఖాయమైన దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీకి బ్యాటింగ్‌ లెజెండ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. గంగూలీ సారథ్యంలో ఇకపై భారత క్రికెట్‌ ముందడుగు వేస్తుందని వీవీఎస్‌ ట్వీట్‌ చేశాడు. అధ్యక్ష స్థానానికి ‘దాదా’ ఒక్కడే నామినేషన్‌ వేయడంతో ఈ నెల 23న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో 47 ఏళ్ల సౌరవ్‌ ఎన్నిక లాంఛనమే కానుంది.

‘త్వరలో నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న సౌరవ్‌ గూంగూలీకి అభినందనలు. నీ సమర్థ సారథ్యంలో భారత క్రికెట్‌ సుసంపన్నమవుతుంది. ఇందులో నాకెలాంటి సందేహం లేదు. నాడు భారత కెపె్టన్‌గా విజయవంతమైనట్లే ఇప్పుడీ పాత్రలోనూ దాదా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై గంగూలీ స్పందిస్తూ ‘థ్యాంక్యూ వీవీఎస్‌. నా ప్రయాణంలో నీ సేవలు, అమూల్యమైన సూచనలు నాకు అవసరం’ అని ట్విట్టర్‌ వేదికగా అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top