సిడ్నీ టెస్ట్‌: నాలుగో రోజు ఆట ప్రారంభం

India Vs Australia 4th Test Day 4 Game Starts - Sakshi

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

సిడ్నీ: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. 236/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ (25) ‍క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అంతకు ముందు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించడంతో అంపైర్లు  మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఆట చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో హ్యాండ్స్‌కోంబ్‌(28), స్కార్క్‌ (0)లు ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను 622/7 స్కోర్‌ వద్ద డిక్లెర్డ్‌ చేసిన భారత్‌.. గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే మ్యాచ్‌కు పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండటం.. భారత విజయవకాశాలపై ప్రభావం చూపనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ డ్రా గా ముగిసినప్పటికి భారత్‌ 2-1తో సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించనుంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 622/7 డిక్లెర్డ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top