భారత్‌కు రెండో విజయం | India to second win | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో విజయం

Nov 2 2016 12:01 AM | Updated on Sep 4 2017 6:53 PM

ఆసియా మహిళల చాంపియన్‌‌స ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

సింగపూర్: ఆసియా మహిళల చాంపియన్‌‌స ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మలేసియా జట్టుతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-0తో గెలిచింది. ఈ విజయంతో ఐదు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ ఏడు పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది.

భారత్ తరఫున పూనమ్ రాణి (7వ నిమిషంలో), దీపిక (45వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత్ తమ చివరిదైన నాలుగో లీగ్ మ్యాచ్‌లో ఈనెల 4న చైనాతో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్ కోసం తలపడతారుు. 

Advertisement
 
Advertisement
Advertisement