పాక్ విజయ లక్ష్యం 97 | india, pak womens cricket match | Sakshi
Sakshi News home page

పాక్ విజయ లక్ష్యం 97

Mar 19 2016 5:14 PM | Updated on Sep 3 2017 8:08 PM

పాక్ విజయ లక్ష్యం 97

పాక్ విజయ లక్ష్యం 97

టీ 20 మహిళల ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.

ఢిల్లీ: టీ 20 మహిళల ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత క్రీడాకారిణిలను పాక్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. భారత జట్టులో కృష్ణమూర్తి  చేసిన 24 పరుగులే టాప్ స్కోర్.

 

తొలుత భారత ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. భారత స్కోరు బోర్డు 10 పరుగులకు చేరుకోవడానికి 7 ఓవర్లు పూర్తయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ మిథాలీ రాజ్(35 బంతుల్లో 16 పరుగులు), కౌర్ (29 బంతుల్లో 16)లను పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో కట్టడిచేశారు. 97 పరుగుల విజయ లక్ష్యంతో పాక్ జట్టు బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement