వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో చోటుపై భారత్ దృష్టి | India is focused on a place in the World Group playoff | Sakshi
Sakshi News home page

వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో చోటుపై భారత్ దృష్టి

Jul 17 2015 12:27 AM | Updated on Sep 3 2017 5:37 AM

వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో చోటుపై భారత్ దృష్టి

వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో చోటుపై భారత్ దృష్టి

ప్రత్యర్థి జట్టు కంటే అక్కడి వాతావరణం నుంచే ఎక్కువ సవాలు ఎదురుకానున్న నేపథ్యంలో భారత్ జట్టు డేవిస్ కప్ పోరుకు ....

నేటి నుంచి కివీస్‌తో డేవిస్ కప్ పోరు
 
క్రైస్ట్‌చర్చ్: ప్రత్యర్థి జట్టు కంటే అక్కడి వాతావరణం నుంచే ఎక్కువ సవాలు ఎదురుకానున్న నేపథ్యంలో భారత్ జట్టు డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి జరగనున్న ఆసియా ఓసియానియా గ్రూప్-1లో రెండో రౌండ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. పేపర్ మీద బలంగా కనిపిస్తున్న భారత్ జట్టు... ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే కివీస్‌లో ఉష్ణోగ్రత 5 నుంచి 7 డిగ్రీలు మాత్రమే నమోదవుతోంది. ఈ ప్రతికూలతను అధిగమించి కివీస్‌ను ఏ మేరకు నిలువరిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం.

మ్యాచ్‌లన్నీ ఇండోర్ స్టేడియంలో జరిగినా ఇప్పటి వరకు భారత ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో ఆడలేదు. కివీస్‌తో తలపడిన చివరి నాలుగుసార్లూ భారత్ ఓడిపోలేదు. చండీగఢ్‌లో ఆడినప్పుడైతే 5-0తో వైట్‌వాష్ చేసింది. ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. శుక్రవారం జరిగే తొలి సింగిల్స్‌లో ప్రపంచ 148వ ర్యాంకర్ సోమ్‌దేవ్... ప్రపంచ 345వ ర్యాంకర్ జోస్ సాంతమ్‌తో; రెండో సింగిల్స్‌లో 151వ ర్యాంకర్ యూకీ బాంబ్రీ... 548వ ర్యాంకర్ మైకేల్ వీనస్‌తో తలపడతారు. శనివారం జరిగే డబుల్స్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని... మార్కస్ డానియెల్-అర్టెమ్ సీతక్‌లను ఎదుర్కొంటారు. ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్.. వీనస్‌తో; యూకీ... సాంతమ్‌తో అమీతుమీ తేల్చుకుంటారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement