ఐదో ర్యాంక్‌లో భారత్ | India in fith rank | Sakshi
Sakshi News home page

ఐదో ర్యాంక్‌లో భారత్

Sep 2 2015 3:42 AM | Updated on Sep 3 2017 8:33 AM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదో ర్యాంక్‌లో నిలిచింది. లంకపై చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా

 కొలంబో : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదో ర్యాంక్‌లో నిలిచింది. లంకపై చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా (100) కీలకమైన మూడు రేటింగ్ పాయింట్లను సాధించింది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న పాకిస్తాన్ (101)కు మరింత చేరువలోకి వచ్చింది. దక్షిణాఫ్రికా (125) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా (106), ఇంగ్లండ్ (102) వరుసగా రెండు, మూ డో ర్యాంక్‌లో ఉన్నాయి. న్యూజిలాండ్ (99), శ్రీలంక (89) ఆరు, ఏడు స్థానాలను దక్కించుకున్నాయి. వెస్టిండీస్ (81), బంగ్లాదేశ్ (47), జింబాబ్వే (5) చివరి 3 స్థానాల్లో నిలిచాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement