
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లో జరిగిన కింగ్స్ కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు మూడో స్థానాన్ని సంపాదించింది. ఈ టోర్నీలో శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది. భారత్ నమోదు చేసిన ఏకైక గోల్‌ను ఆట 17వ నిమిషంలో అనిరుధ్ థాపా చేశాడు. కొత్త కోచ్ ఇగోర్ స్టిమాక్ పర్యవేక్షణలో భారత్‌కిదే తొలి అంతర్జాతీయ విజయం.