
భారీ స్కోరు దిశగా భారత్
మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్లో భారత్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది.
రాంచీ: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్నరెండో మ్యాచ్లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టీమిండియా పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 93 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టీమిండియా ఓపెనర్లలో శిఖర్ ధావన్(51; 25 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్సర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ(30), అజింక్యా రహానే(9) క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్ లో శ్రీలంకపై ఓటమి పాలైన ధోని సేన ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు లంకేయులు మొదటి మ్యాచ్ ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో పోరుకు సన్నద్దమయ్యారు.