భారత్ X పాకిస్తాన్ | India face Pakistan test in Hockey World League Semi-Final | Sakshi
Sakshi News home page

భారత్ X పాకిస్తాన్

Jun 25 2015 11:54 PM | Updated on Sep 3 2017 4:21 AM

భారత్ X పాకిస్తాన్

భారత్ X పాకిస్తాన్

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం... ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందున ధీమా... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్ ఆటతీరు ఇది.

హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో నేడు అమీతుమీ
యాంట్‌వర్ప్ (బెల్జియం): వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం... ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందున ధీమా... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్ ఆటతీరు ఇది. ఇలాంటి ఉత్సాహంతో భారత హాకీ జట్టు మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సర్దార్‌సింగ్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు పాక్ ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్కటి గెలిచింది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నట్లే.
 
ఈ రెండు జట్ల మధ్య చివరిసారిగా చాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్ భారత్‌లోనే జరిగింది. అందులో గెలిచిన పాక్ ఆటగాళ్లు మ్యాచ్ తర్వాత ప్రేక్షకులను ఉద్దేశించి అసభ్యంగా సంజ్ఞలు చేశారు. దీంతో అప్పట్లో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ భారత్, పాక్ మ్యాచ్ జరగనుండటం ఇప్పుడే. దీంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి బాగా పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement