రెండో రౌండ్‌కు భారత్ | india at second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌కు భారత్

Mar 18 2015 12:57 AM | Updated on Sep 2 2017 10:59 PM

ప్రపంచకప్ ఫుట్‌బాల్ అర్హత మ్యాచ్‌ల్లో భారత జట్టు రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్ రెండో అంచెలో భారత్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఖాట్మండు: ప్రపంచకప్ ఫుట్‌బాల్ అర్హత మ్యాచ్‌ల్లో భారత జట్టు రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్ రెండో అంచెలో భారత్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే భారత్‌లో జరిగిన తొలి అంచెలో ఇదే జట్టుపై 2-0 తేడాతో నెగ్గడం కలిసొచ్చింది. దీంతో రెండో రౌండ్‌కు భారత్ అర్హత సాధించింది. దశరథ్ రంగసాల స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ద్వితీయార ్ధంలో నేపాల్ అద్భుత ఆటతీరును చూపింది. అయితే 57వ నిమిషంలో రాబిన్ సింగ్ నెట్‌లోకి బంతిని పంపినా అది తన చేతిని ఉపయోగించిన ట్టు తేలడంతో రిఫరీ గోల్‌గా అంగీకరించలేదు. రెండో రౌండ్ అర్హత మ్యాచ్‌లు జూన్ 11 నుంచి 2016 మార్చి 29 వరకు జరుగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement