గోల్డెన్‌ డక్‌ అయ్యే చాన్స్‌ను మిస్‌ చేశారు.. | Ind vs WI: KL Rahul Dropes Hope's Catch | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ డక్‌ అయ్యే చాన్స్‌ను మిస్‌ చేశారు..

Dec 18 2019 6:28 PM | Updated on Dec 18 2019 6:29 PM

Ind vs WI: KL Rahul Dropes Hope's Catch - Sakshi

విశాఖ: టీమిండియా ఫీల్డింగ్‌లో మరోసారి వైఫల్యం కనిపించింది. వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు టీ20ల సిరీస్‌లు పలు క్యాచ్‌లను వదిలేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో కూడా అదే రిపీట్‌ చేస్తోంది. తొలి వన్డేలో హెట్‌మెయిర్‌ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ జారవిడవడంతో మనవాళ్లు అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఆ క్యాచ్‌ వదిలేసిన తర్వాత హెట్‌మెయిర్‌  విధ్వంసర సృష్టించి మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చేశాడు. కాగా, రెండో వన్డేలో కూడా టీమిండియా ఆదిలోనే ఒక క్యాచ్‌ను నేలపాలు చేసింది. దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లో రెండు బంతుల్ని లూయిస్‌ ఆడాడు.

రెండో బంతికి బై రూపంలో పరుగు రావడంతో క్రీజ్‌లో కి షాయ్‌ హోప్‌ వచ్చాడు. హోప్‌ ఆడిన తొలి బంతే ఎడ్జ్‌ తీసుకుని స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రాహుల్‌ చేతుల్లో పడింది. అయితే ఆ సునాయసమైన క్యాచ్‌ను రాహుల్‌ విడిచిపెట్టాడు. దాంతో  హోప్‌ను గోల్డెన్‌ డక్‌గా పంపే చాన్స్‌ను టీమిండియా మిస్‌ చేసుకుంది. తొలి వన్డేలో హోప్‌ సెంచరీ సాధించి విండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంచితే, ఆసియాలో ఆడిన గత  ఆరు వన్డే ఇన్నింగ్స్‌ల్లో హోప్‌ విశేషంగా రాణించాడు. ఆసియాలో వరుసగా హోప్‌ నమోదు చేసిన ఇన్నింగ్స్‌ లు 146 నాటౌట్‌,  108నాటౌట్‌, 77నాటౌట్‌,  43, 109 నాటౌట్, 102నాటౌట్‌లుగా ఉన్నాయి.(ఇక్కడ చదవండి: ఇరగదీసిన టీమిండియా.. విండీస్‌కు భారీ లక్ష్యం)

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(159; 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌(102; 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు)ల సెంచరీలకు జతగా, శ్రేయస్‌ అయ‍్యర్‌(53;32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌(39; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో  భారత్‌ భారీ స్కోరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement