అరంగేట్రం చేసిన సైనీ | IND VS WI 3rd ODI: Navdeep Saini Makes His Debut | Sakshi
Sakshi News home page

అరంగేట్రం చేసిన సైనీ

Dec 22 2019 1:20 PM | Updated on Dec 22 2019 1:39 PM

IND VS WI 3rd ODI: Navdeep Saini Makes His Debut - Sakshi

కటక్‌: వన్డే సిరీస్‌ను డిసైడ్‌ చేసే కీలక మ్యాచ్‌కు ఆతిథ్య టీమిండియా పర్యాటక వెస్టిండీస్‌ జట్లు సమయాత్తమయ్యాయి. నిర్ణయాత్మకమైన ఈ చివరి వన్డే ద్వారా యువ పేస్‌ బౌలర్‌ నవీదప్‌ సైనీ వన్డే  ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. సారథి విరాట్‌ కోహ్లి టీమిండియా క్యాప్‌ను సైనీకి అందించి ఆల్‌దబెస్ట్‌ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా చివరి వన్డేకు దూరమవడంతో అతడి స్థానంలో సైనీ జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్కటి మినహా టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక విండీస్‌ జట్టు కూడా విశాఖ జట్టునే కొనసాగించింది.

ఇక ఇప్పటికే టీ20 సిరీస్‌ గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా ఇదే ఊపులో వన్డే సిరీస్‌ కూడా కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. అంతేకాకుండా ఈ ఏడాదిని విజయంతో ముగించాలని కోహ్లిసేన తహతహలాడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌తో పాటు పరువు నిలుపుకోవాలనే ఉవ్విళ్లూరుతోంది.

తుదిజట్లు:
వెస్టిండీస్‌: కీరన్‌ పొలార్డ్‌(కెప్టెన్‌), ఎవిన్‌ లూయిన్‌, షై హోప్‌, హెట్‌మైర్‌, రోస్టన్‌ చేజ్‌, నికోలస్‌ పూరన్‌, హోల్డర్‌, కీమో పాల్‌, అల్జారి జోసెఫ్‌, క్యారీ పైర్‌, షెల్డన్‌ కాట్రెల్‌
టీమిండియా: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యార్‌, రిషభ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, నవదీపై సైనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement