మైకేల్‌ వాన్‌.. నీ బుద్ధిని పెంచుకో!

Ind vs Ban: Vaughan Left Bemused By Strange Comment - Sakshi

ఇండోర్‌: టీమిండియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఇండోర్‌లోని హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ చేసిన ట్వీట్‌ విమర్శల పాలైంది. ఇండోర్‌ పిచ్‌ గురించి కొత్తగా చెప్పాలని ప్రయత్నించిన వాన్‌కు ఒక నెటిజన్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. ఇంతకీ వాన్‌ ఏమన్నాండంటే.. ‘ ఇది టెస్టు మ్యాచ్‌ పిచ్‌. భారత్‌లో ఉన్న పిచ్‌ల్లో ఇదొక ఉత్తమైనది’ అని అన్నాడు. అంతటితో ఆగకుండా ‘ ఇది వైట్‌ మ్యాన్స్‌ పిచ్‌. ఇదొక కొత్త కామెంట్‌. ఇటీవల కాలంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టులోని విభిన్నమైన సహజత్వాన్ని మీరు చూడలేదా?’ అంటూ మరొక పోస్ట్‌ చేశాడు.

దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ కూడా ఇంగ్లండ్‌ క్రికెట్‌ గొప్పను చెప్పుకునే యత్నమే చేశాడని విమర్శించారు. ఒక అభిమాని అయితే వాన్‌కు గట్టిగానే చురకలంటించాడు. పిచ్‌పై పచ్చిక ఉంటే బంతి టర్న్‌ అయ్యే అవకాశాలు కంటే సీమర్లకే ఎందుకు అనుకూలిస్తుంది.  మీ వైట్‌మ్యాన్స్‌ కోసమా.  వాన్‌.. ముందు నీ బుద్ధిని పెంచుకో.  ప్రతీ వికెట్‌ వైట్‌ మ్యాన్స్‌కు ప్రాతినిథ్యం వహించదనే విషయం తెలుసుకో. ఎప్పుడైనా విభిన్నమైన వికెట్‌ ఉంటే టెస్టు క్రికెట్‌లో మరింత మజా పెరుగుతుందనే విషయం గ్రహించు’ అని కౌంటర్‌ ఇచ్చాడు.

ఈ పిచ్‌లో పచ్చిక ఉన్న కారణంగానే సీమర్లకు అనుకూలిస్తుందని టాస్‌కు వచ్చిన క్రమంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పుకొచ్చాడు. తాము టాస్‌ ఓడిపోయినా ముందగా తమకు బౌలింగే వచ్చిందని, ఒకవేళ టాస్‌ గెలిచినా తొలుత బౌలింగే తీసుకునే వాళ్లమని తెలిపాడు. ఈ క్రమంలోనే ఇండోర్‌ పిచ్‌ గురించి వాన్‌ చేసిన ట్వీట్‌ వ్యంగ్యంగా అనిపించడంతో అతనిపై భారత ఫ్యాన్స్‌ సెటైర్లు వేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top