సెమీస్‌లో కృష్ణప్రియ | In semifinal krishnaiah | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో కృష్ణప్రియ

Sep 20 2013 12:55 AM | Updated on Aug 18 2018 8:49 PM

ఏపీ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. విజయవాడలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగ ంలో నాలుగో సీడ్ కృష్ణప్రియ 21-9, 21-12తో లావణ్య (కాకినాడ)పై గెలిచింది.

జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. విజయవాడలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగ ంలో నాలుగో సీడ్ కృష్ణప్రియ 21-9, 21-12తో లావణ్య (కాకినాడ)పై గెలిచింది. తనతో పాటు రెండో సీడ్ రితుపూర్ణిమ 21-9, 21-4తో సోనికా సాయి (కాకినాడ)పై నెగ్గింది. టాప్ సీడ్ రుత్వికా శివాని (ఖమ్మం) 21-16, 21-10తో సిరి చందన (మెదక్)పై, మూడో సీడ్ సంతోష్ హాసిని (విశాఖపట్నం) 21-17, 21-14తో పూజ (హైదరాబాద్)పై విజయం సాధించారు.
 
  పురుషుల సింగిల్స్‌లో హైదరాబాదీ ఆటగాళ్లు అర్జున్ రెడ్డి, వినాయక్ సెమీస్‌కు చేరుకున్నారు. అర్జున్ రెడ్డి 21-17, 21-7తో బాలుమహేంద్ర (విశాఖపట్నం)ను, వినాయక్ 21-16, 21-14తో శశిధర్ (హైదరాబాద్)ను ఓడించారు. కనిష్క్ (గుంటూరు) 21-15, 21-12తో కిరణ్ కుమార్ (రంగారెడ్డి)పై, నాలుగో సీడ్ అజయ్ కుమార్ (మెదక్) 21-12, 21-16తో వికాస్ హర్ష (నెల్లూరు)పై గెలుపొందారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement