ఎఫైర్ల వివాదంలో ఇమాముల్‌ హక్‌! | Imam ul Haq Accused Of Having Multiple Affairs | Sakshi
Sakshi News home page

ఎఫైర్ల వివాదంలో ఇమాముల్‌ హక్‌!

Jul 25 2019 11:32 AM | Updated on Jul 25 2019 11:32 AM

Imam ul Haq Accused Of Having Multiple Affairs - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఇమాముల్‌ హక్‌ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రేమ పేరుతో అనేక మంది యువతులను ఇమాముల్‌ హక్‌ మోసం చేశాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి సదరు యువతులతో ఇమాముల్‌ చాట్‌ చేసిన స్క్రీన్‌ షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్‌ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ తన స్టార్‌డమ్‌ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడని తెలుస్తోంది. తమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని, వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని పేర్కొన్నాయి. గత ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని పేర్కొన్నాయి.

అందుకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఆ యువతులతో ఇమామ్‌ కొనసాగించిన ఛాటింగ్‌ విశేషాలు సైతం అనేక స్క్రీన్‌షాట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచకప్‌లో ఇమామ్‌ మంచి ప్రదర్శన చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత తలనొప్పిగా మారింది. ప్రధానంగా చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న ఇంజమాముల్‌ హక్‌ను ఇమాముల్‌పై వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఇంజమామ్‌కు మేనల్లుడైన ఇమాముల్‌ వీటిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement