ఒకే స్కోరు.. ఒకే బౌలర్‌ | Imam ul and Zaman earlier put on 81 runs for the first wicket | Sakshi
Sakshi News home page

ఒకే స్కోరు.. ఒకే బౌలర్‌

Jun 23 2019 5:18 PM | Updated on Jul 11 2019 8:55 PM

Imam ul and Zaman earlier put on 81 runs for the first wicket - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను ఇమాముల్‌ హక్‌- ఫకార్‌ జమాన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు జత చేసిన తర్వాత ఫకార్‌ జమాన్‌(44; 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు.  సఫారీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ వేసిన 15 ఓవర్‌ ఐదో బంతికి ఫకార్‌ జమాన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ఇమాముల్‌ హక్‌కు బాబర్‌ అజామ్‌ జత కలిశాడు.

ఈ జోడి 17 పరుగులు జత చేసిన తర్వాత ఇమాముల్‌ హక్‌(44; 57 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాగా, ఇమాముల్‌ హక్‌-ఫకార్‌ జమాన్‌లు 44 పరుగుల వ్యక్తిగత పరుగులు సాధించిన తర్వాత పెవిలియన్‌ చేరడం ఇక్కడ గమనార్హం. అయితే వీరిద్దరూ ఇమ్రాన్‌ తాహీర్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో ఒకే స్కోరు.. ఒకే బౌలర్‌ అనుకోవడం అభిమానుల వంతైంది. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్‌ 30 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. మహ్మద్‌ హఫీజ్‌(20) మూడో వికెట్‌గా ఔటయ్యాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement