మ్యాచ్‌ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా

Published Wed, Mar 4 2020 4:55 PM

ICC Women's T20 World Cup: No reserve Day Semi Finals - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్‌ ఏ నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు, గ్రూప్‌ బి నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఫైనల్‌ బెర్త్‌ కోసం తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా, మరో సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. కాగా, ఈ రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు గురువారం సిడ్నీ వేదికగా జరగనున్నాయి. అయితే సిడ్నీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ జరగాల్సిన రెండు లీగ్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే గురువారం సిడ్నీలో వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ అధికారులు తెలిపారు. మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశం లేదని, మ్యాచ్‌కు పలమార్లు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. 

ఒకవేళ వర్షం కారణంగా సెమీఫైనల్‌ మ్యాచ్‌లు రద్దయితే గ్రూప్‌ దశలో ఆగ్రస్థానంలో ఉన్న జట్లు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాయని ప్రపంచకప్‌ నిర్వాహకులు తెలిపారు. దీంతో గ్రూప్‌-ఏలో టాపర్‌ టీమిండియా, గ్రూప్‌-బి టాపర్‌ దక్షిణాఫ్రికా జట్లు మార్చి 8న మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే ఫైనల్లో తలపడతాయి. ఇక సెమీఫైనల్లో రిజర్వ్‌డే పెట్టాలన్న ఆసీస్‌ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ షెడ్యూల్‌ రూపొందాక మార్పులు చేర్పులు సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా అక్టోబర్‌లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ రిజర్వ్‌డే లేదని వివరించింది.

చదవండి:
మళ్లీ టాప్‌టెన్‌లోకి వచ్చాడు
'కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది'

Advertisement
Advertisement