టీవలి కాలంలో తరచూ విమర్శలనెదుర్కొంటున్న అంపైర్ నిర్ణయ పునస్సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని మరింత మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నడుం బిగించింది.
అబుదాబి: ఇటీవలి కాలంలో తరచూ విమర్శలనెదుర్కొంటున్న అంపైర్ నిర్ణయ పునస్సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని మరింత మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నడుం బిగించింది. ప్రస్తుతం మైదానంలో అంపైర్ నిర్ణయాలను ఆటగాడు అప్పీల్ చేసుకుంటే థర్డ్ అంపైర్ రీప్లే ద్వారా సమీక్షించి నిర్ణయం ప్రకటిస్తున్నారు.
అయితే ఈ పద్ధతిని మార్చి మ్యాచ్ ప్రసారమవుతున్న అన్ని కెమెరాలను ఉపయోగించుకుని ఓ స్వతంత్ర వ్యక్తి చేత నిర్ణయాలను వెలువరించే పద్ధతిని ఐసీసీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అఫీసియేట్ రివ్యూ పద్ధతి (ఓఆర్ ఎస్)గా పిలుస్తున్నారు.