‘డ్యాన్స్‌ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’

ICC T20 World Cup: Jemimah Rodrigues Dance With Security Guard - Sakshi

హైదరాబాద్: వయసు 20 ఏళ్లు కూడా లేవు.. జట్టులోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు.. కానీ ఆమె క్రీజులో ఉందంటే అటు అభిమానులకు.. ఇటు సారథికి కొండంత విశ్వాసం. క్లిష్ట సమయాలలో నిలకడగా, ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ అందరి మన్ననలను పొందుతోంది టీమిండియా బ్యాట్స్‌వుమెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌. అయితే మైదానంలో ప్రొఫెషనల్‌ ఆటతీరును ప్రదర్శించే రోడ్రిగ్స్‌.. మైదానం వెలుపల చేసే సందడి మామూలుగా ఉండదు. సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్‌తో చేసే సందడి, అల్లరిని అందరూ ఎంజాయ్‌ చేస్తుంటారు. తాజాగా రోడ్రిగ్స్‌కు ఐసీసీ కూడా ఫిదా అయింది. 

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో ప్రాక్టీస్‌ ముగించుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌కు బయల్దేరిన రోడ్రిగ్స్‌ సెక్యూరిటీ గార్డుతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేసింది. చాలా ఫన్‌గా ఉన్న ఆ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం రోడ్రిగ్స్‌ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సెక్యూరిటీతో కాలు కదిపిన రోడ్రిగ్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌ సెషన్‌లు, వ్యూహప్రతివ్యూహాలతో ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుందని ఇలాంటి వాటితో కాస్త ఉపశమనం పొందుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక ‘డ్యాన్స్‌ బాగుంది.. ప్రపంచకప్‌ ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుందని’మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.  
 

చదవండి:
హ్యాట్రిక్‌పై భారత్‌ గురి
అతడు బౌలర్‌ కెప్టెన్‌: ఓజా

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top