హ్యుమే హ్యాట్రిక్: కోల్‌కతా విజయం | Iain Hume hat-trick helps Atletico de Kolkata thrash Mumbai City FC 4-1 | Sakshi
Sakshi News home page

హ్యుమే హ్యాట్రిక్: కోల్‌కతా విజయం

Nov 2 2015 12:40 AM | Updated on Sep 3 2017 11:50 AM

హ్యుమే హ్యాట్రిక్: కోల్‌కతా విజయం

హ్యుమే హ్యాట్రిక్: కోల్‌కతా విజయం

స్టార్ స్ట్రయికర్ ఇయాన్ హ్యుమే హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికోడి కోల్‌కతా ఘనవిజయం సాధించింది.

ముంబై: స్టార్ స్ట్రయికర్ ఇయాన్ హ్యుమే హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికోడి కోల్‌కతా ఘనవిజయం సాధించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఆదివారం ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4-1 తేడాతో నెగ్గింది. 34వ నిమిషంలో హ్యుమే తొలి గోల్‌తో పాటు 45వ నిమిషంలో పెనాల్టీ కిక్‌తో రెండో గోల్ అందించాడు. ఆ తర్వాత 71వ నిమిషంలో ముంబై తరఫున బెనచౌర్ ఏకైక గోల్ సాధించాడు. 77వ నిమిషంలో ఫెర్నాండెజ్ కోల్‌కతా ఆధిక్యం మరింత పెంచగా 82వ నిమిషంలో హ్యుమే హ్యాట్రిక్ గోల్‌తో జట్టుకు తిరుగులేని విజయం దక్కింది. నేడు (సోమవారం) ఐఎస్‌ఎల్‌కు విశ్రాంతి దినం.

Advertisement
 
Advertisement
Advertisement