‘నాకు చెల్లి ఉంటే స్టోక్స్‌కి ఇచ్చి పెళ్లి చేసేవాడ్ని’

I Would Have Wanted My Sister To Marry Stokes Swann - Sakshi

లీడ్స్‌:  యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో ఓటమి అంచుల వరకూ వెళ్లిన ఇంగ్లండ్‌ తిరిగి పుంజుకుని అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడంతో ఆ దేశ క్రికెటర్లు, మాజీలు ఉబ్బితబ్బి అయిపోతున్నారు.  ఇంగ్లండ్‌ విజయానికి ప్రధాన కారణమైన బెన్‌ స్టోక్స్‌ను మాజీ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.  ఇందులో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అయితే స్టోక్స్‌ను ‘బావ’ను చేసుకోవాలని ఉందని పేర్కొన్నాడు. అయితే తనకు అక్కా చెల్లెల్లు లేరన్నాడు. ‘నాకు అక్కాచెల్లెల్లు లేరు. కానీ నాకే ఓ సోదరి ఉంటే మాత్రం కచ్చితంగా అతడికిచ్చి పెళ్లి చేసేవాడిని’ అని స్వాన్‌ పేర్కొన్నాడు.

స్వాన్‌ ట్వీట్‌ ను విపరీతంగా రీట్వీట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘నాకైతే చెల్లెల్లు లేరు. కానీ ఒకరిని దత్తత తీసుకుని అతడికిచ్చి పెళ్లిచేయమని మా అమ్మను అడుగుతాను అని ఒకరు ట్వీట్‌ చేయగా, ‘ఇది 21వ శతాబ్దం స్వాన్‌, నువ్వే అతడిని పెళ్లి చేసుకోవచ్చు’ అని మరొకరు ట్వీట్‌ చేశారు. కాగా, యాషెస్‌ మూడో టెస్టులో ఆసీస్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఇంకా వికెట్‌ మిగిలి ఉండగా ఛేదించింది. బెన్‌ స్టోక్స్‌ (219 బంతుల్లో 135 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) క్రీజ్‌లో పాతుకుపోయి ఇంగ్లండ్‌కు గెలుపును అందించాడు. 286 వద్ద 9వ వికెట్‌ పడిన దశలో మరో 73 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టోక్స్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top