'భారత్ లో గెలవడమే నా కల' | I dream of winning a Test series in India, says Rangana Herath | Sakshi
Sakshi News home page

'భారత్ లో గెలవడమే నా కల'

Nov 6 2017 4:24 PM | Updated on Nov 9 2018 6:43 PM

 I dream of winning a Test series in India, says Rangana Herath - Sakshi

న్యూఢిల్లీ: భారత్ లో కనీసం ఒక టెస్టు సిరీస్ ను గెలవడమే తన కల అని శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ పేర్కొన్నాడు. ఇటీవల యూఏఈలో పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న శ్రీలంక జట్టులో సభ్యుడైన హెరాత్.. భారత్ లో కూడా టెస్టు సిరీస్ గెలిచి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని ఉందన్నాడు. త్వరలో భారత్ తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ 20ల సిరీస్ కు సిద్దమవుతున్న తరుణంలో హెరాత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

' భారత్ లో టెస్టు సిరీస్ గెలవడమనేది నా స్వప్నం. ఒకవేళ భారత్ లో టెస్టు మ్యాచ్ గెలిస్తే నిజంగా అద్భుతమే అవుతుంది. ఇప్పటివరకూ అక్కడ టెస్టు మ్యాచ్ గెలవకపోవడంతో దాన్ని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నా. అదే సమయంలో సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలనేదే నా లక్ష్యం 'అని హెరాత్ పేర్కొన్నాడు. ఇటీవల యూఏఈలో పాకిస్తాన్ పై టెస్టు సిరీస్ గెలవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందన్నాడు. అదే విజయపరంపరను భారత్ లో కూడా కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నట్లు హెరాత్ తెలిపాడు. ఇప్పటివరకూ భారత్ లో శ్రీలంక జట్టు ఒక్క టెస్టు మ్యాచ్ ను గెలవని సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement