రన్నరప్‌ సిరిల్‌ వర్మ | Hyderabad Shuttler Siril Verma Was The Runner Up In The Badminton Tournament | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సిరిల్‌ వర్మ

Sep 30 2019 4:05 AM | Updated on Sep 30 2019 4:05 AM

Hyderabad Shuttler Siril Verma Was The Runner Up In The Badminton Tournament - Sakshi

మాల్దీవ్స్‌ చాలెంజర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ షట్లర్‌ సిరిల్‌ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో అతను 13–21, 18–21తో భారత్‌కే చెందిన కౌశల్‌ ధర్మామర్‌ చేతిలో వరుస గేముల్లో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. డబుల్స్‌ అన్ని విభాగాల్లో ఫైనల్‌కు చేరిన భారత షట్లర్లు... చివరి అడ్డంకిని మాత్రం దాటలేకపోయారు. మహిళల డబుల్స్‌ విభాగంలో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి జోడి 10–21, 21–17, 12–21 సయక హొబర– నత్సుకి సోనె (జపాన్‌) జంట చేతిలో, పురుషుల డబుల్స్‌లో అరుణ్‌ జార్జ్‌– సన్యం శుక్లా జంట 9–21, 20–22తో కిచిరో ముత్సుయ్‌– యొషినోరి తకెచి (జపాన్‌) ద్వయం చేతిలో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాయి ప్రతీక్‌ కృష్ణ ప్రసాద్‌– అశ్విని భట్‌ జోడీ 11–21, 15–21తో చరోంకితమరోన్‌– చసినీ కొరెపాప్‌ (తైవాన్‌) జంట జోతిలో ఓడి రన్నరప్‌గా నిలిచారు.  

Advertisement
 
Advertisement
Advertisement