ప్రతిభను ప్రోత్సహించాలి: గోపీచంద్ | hyderabad got talent event in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రతిభను ప్రోత్సహించాలి: గోపీచంద్

Sep 2 2016 12:20 PM | Updated on Sep 7 2018 5:34 PM

ప్రతిభను ప్రోత్సహించాలి: గోపీచంద్ - Sakshi

ప్రతిభను ప్రోత్సహించాలి: గోపీచంద్

నగరంలో ప్రతిభావంతులకు కొదవలేదని, వారికి సరైన పద్ధతిలో శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.

రాయదుర్గం: నగరంలో ప్రతిభావంతులకు కొదవలేదని, వారికి సరైన పద్ధతిలో శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. గురువారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని షెరటాన్ హోటల్‌లో జరిగిన ‘హైదరాబాద్ గాట్ ట్యాలెంట్’ ఈవెంట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని దాన్ని వెలికితీసి తగిన శిక్షణ ప్రోత్సాహం అందిస్తే వారు రాణిస్తారని అన్నారు. మన హైదరాబాద్‌లో విభిన్న రంగాలపై ఆసక్తి కలిగిన వారున్నారని... వీరందరిని ప్రోత్సహించేందుకు ఈ ఈవెంట్ చక్కని వేదికని ఆయన చెప్పారు. న్యూక్ రేడియో ప్రతినిధి పరంజిత్‌సింగ్ మాట్లాడుతూ వచ్చే నెల 1 నుంచి 10వ తేదీ వరకు నిజాం కాలేజి గ్రౌండ్‌‌సలో ‘హైదరాబాద్ గాట్ ట్యాలెంట్’ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement