బ్రెజిల్‌కు హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు | hyderabad football team to brazil | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌కు హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు

Jul 1 2017 10:31 AM | Updated on Sep 7 2018 5:34 PM

బ్రెజిల్‌కు హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు - Sakshi

బ్రెజిల్‌కు హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు

నేమార్‌ జూనియర్‌ గ్లోబల్‌ ‘ఫైవ్‌–ఎ–సైడ్‌’ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ స్పోర్టింగ్‌ ఎఫ్‌సీ ఫుట్‌బాల్‌ జట్టు సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్‌: నేమార్‌ జూనియర్‌ గ్లోబల్‌ ‘ఫైవ్‌–ఎ–సైడ్‌’ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ స్పోర్టింగ్‌ ఎఫ్‌సీ ఫుట్‌బాల్‌ జట్టు సత్తా చాటింది. ఈ టోర్నీలో జాతీయ చాంపియన్‌గా నిలిచి వరల్డ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గుర్గావ్‌లోని సైబర్‌ హబ్‌లో జరిగిన నేషనల్‌ ఫైనల్స్‌ టోర్నీ టైటిల్‌ పోరులో హైదరాబాద్‌ స్పోర్టింగ్‌ ఎఫ్‌సీ జట్టు ముంబైకి చెందిన కళింగ రేంజర్స్‌ జట్టును ఓడించింది.

 

దీంతో భారత్‌ నుంచి వరల్డ్‌ ఫైనల్స్‌ టోర్నీకి అర్హత సాధించింది. బ్రెజిల్‌లో జూలై 7, 8 తేదీల్లో వరల్డ్‌ ఫైనల్స్‌ పోటీలు జరుగుతాయి. మొత్తం వరల్డ్‌ ఫైనల్స్‌ టైటిల్‌ కోసం ఆరు ఖండాలకు చెందిన 53 జాతీయ చాంపియన్‌ జట్లు తలపడతాయి.  

 

Advertisement
 
Advertisement
Advertisement