
సాక్షి, హైదరాబాద్: రెడ్‌బుల్ నెమార్ జూనియర్స్ ఫైవ్–ఎ–సైడ్ క్వాలిఫయింగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్‌సీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. బేగంపేట్‌లోని హాట్‌పుట్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటిన హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్‌సీ జట్టు ‘నేషనల్ ఫైనల్స్’కు అర్హత సాధించింది.ఈ టోర్నీకి అర్హత సాధించడం హైదరాబాద్‌కిది నాలుగోసారి. హైదరాబాద్ అంచె క్వాలిఫయింగ్ పోటీల్లో మొత్తం 126 జట్లు పాల్గొనగా... ఫైనల్లో హైదరాబాద్ 1–0తో ఐటీటీఐ జట్టుపై గెలుపొందింది. గతేడాది హైదరాబాద్ జట్టు నేషనల్ చాంపియన్‌గా నిలిచి వరల్డ్ ఫైనల్స్‌లో కూడా పాల్గొంది.
నేషనల్ ఫైనల్స్ కోసం జనవరి 19 నుంచి మార్చి 10 వరకు దేశం లోని 15 ప్రధాన నగరాల్లో అర్హత పోటీలను నిర్వహించారు. ముంబై, పుణే, అహ్మదాబాద్, గోవా, ఢిల్లీ, జైపూర్, చండీగఢ్, గువాహటి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ఐజ్వాల్, షిల్లాంగ్ నగరాల్లో నిర్వహించిన క్వాలిఫయింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఏప్రిల్‌లో జరుగనున్న నేషనల్ ఫైనల్స్‌లో పాల్గొంటాయి. అక్కడ సత్తా చాటిన జట్లు బ్రెజిల్ వేదికగా జూలైలో జరుగనున్న వరల్డ్ ఫైనల్స్‌కు చేరతాయి.