భారత్ ప్రత్యర్థి బ్రిటన్ | HWL Final: Great Britain set up quarterfinal date with India | Sakshi
Sakshi News home page

భారత్ ప్రత్యర్థి బ్రిటన్

Dec 2 2015 2:38 AM | Updated on Sep 3 2017 1:19 PM

భారత్ ప్రత్యర్థి బ్రిటన్

భారత్ ప్రత్యర్థి బ్రిటన్

హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ప్రత్యర్థి ఖరారైంది.

హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ
రాయ్‌పూర్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ప్రత్యర్థి ఖరారైంది. గ్రూప్ ‘బి’లో చివరిదైన నాలుగో స్థానంలో నిలిచిన భారత్... గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచిన బ్రిటన్ జట్టుతో తలపడుతుంది. మంగళవారంతో రెండు గ్రూప్‌ల లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బెల్జియంతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను బ్రిటన్ 3-3 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. దాంతో మొత్తం ఏడు పాయింట్లతో బ్రిటన్ ఈ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచింది.

మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6-0తో కెనడాను ఓడించి ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. నాలుగు పాయింట్లతో బెల్జియం మూడో స్థానంలో, పాయింట్లేమీ సాధించని కెనడా నాలుగో స్థానంలో నిలిచాయి. బుధవారం జరిగే రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో కెనడాతో నెదర్లాండ్స్; జర్మనీతో ఆస్ట్రేలియా తలపడతాయి. గురువారం జరిగే మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో భారత్; బెల్జియంతో అర్జెంటీనా ఆడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement