రీతూ..గుడ్ బై | Hurt Ritu Rani Retires From International Hockey | Sakshi
Sakshi News home page

రీతూ..గుడ్ బై

Sep 22 2016 11:37 AM | Updated on Sep 4 2017 2:32 PM

రీతూ..గుడ్ బై

రీతూ..గుడ్ బై

ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్ ముందు భారత మహిళ హాకీ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన మాజీ కెప్టెన్ రీతూ రాణి అంతర్జాతీయ హాకీకి గుడ్ బై చెప్పింది.

న్యూఢిల్లీ: ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్ ముందు భారత మహిళ హాకీ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన మాజీ కెప్టెన్ రీతూ రాణి అంతర్జాతీయ హాకీకి గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని రీతూ మెయిల్ ద్వారా వెల్లడించినట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బత్రా తెలిపారు. 'రెండు రోజుల క్రితం జాతీయ హాకీ శిబిరంలో పాల్గొనడం లేదని రీతూ పేర్కొంది. దాంతో పాటు అంతర్జాతీయ హాకీ నుంచి వీడ్కోలు చెబుతున్న విషయాన్ని కూడా ఆ మెయిల్ స్పష్టం చేసింది. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. భారత హాకీ జట్టుకు సేవలందించిన రీతూ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం' అని బత్రా పేర్కొన్నారు.

గత రెండు నెలల క్రితం రీతూను అటు కెప్టెన్గా, ఇటు క్రీడాకారిణిగా జట్టు నుంచి తొలగిస్తూ హాకీ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే రీతూ ఆవేదన వ్యక్తం చెందింది. తనపై వివక్ష చూపించి జట్టు నుంచి తొలగించారంటూ కన్నీటి పర్యంతమైంది.

Advertisement
 
Advertisement
Advertisement