ధోని సేన సెమీస్కు చేరాలంటే..

ధోని సేన సెమీస్కు చేరాలంటే..


వరల్డ్ టీ 20లో భాగంగా  బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక పరుగు తేడాతో గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది టీమిండియా.  అయితే  ధోని సేన సెమీస్కు చేరాలంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో  తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు టీమిండియా నెట్ రన్రేటే ప్రధాన కారణం.  భారత్ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించినా రన్ రేట్లో మాత్రం పాకిస్తాన్, ఆసీస్  జట్ల కంటే వెనకబడింది. ఇదే సమయంలో శుక్రవారం ఆసీస్-పాకిస్తాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతే అక్కడితో ఆ జట్టు కథ ముగుస్తుంది.



అదే సమయంలో గ్రూప్-2 నుంచి  సెమీస్ లోకి ప్రవేశించే రెండో జట్టు కోసం ఆసీస్-భారత జట్ల మధ్య పోటీ నెలకొని ఉంటుంది. ఇక్కడ భారత్ గెలిస్తే నేరుగా సెమీస్కు చేరుతుంది.  ఒకవేళ ఆసీస్తో మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచి, భారత్పై ఆసీస్ గెలిస్తే మాత్రం ఈ మూడు జట్లు తలో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించినట్లువుతుంది. అప్పుడు నాకౌట్ సమీకరణాలకు నెట్ రన్ రేట్ పైనే ఆధారపడాలి. అయితే ప్రస్తుత భారత్ నెట్ రన్రేట్ (-0.546) ఆందోళనకరంగా ఉండగా,  పాకిస్తాన్ రన్ రేట్ (+0.254), ఆస్ట్రేలియా రన్ రేట్(+0.108)లు ముందంజలో ఉన్నాయి. భారత్ గెలిచిన రెండు మ్యాచ్లతో పాటు, నెట్ రన్ రేట్ను చూస్తే మన జట్టు సెమీస్ కు చేరడం కష్టమే. వీటితో సంబంధం లేకుండా ధోని సేన సెమీ ఫైనల్ కు చేరాలంటే కచ్చితంగా ఆసీస్పై మ్యాచ్ను గెలవడం ఒక్కటే మార్గం. 



ఇదిలా ఉండగా వరల్డ్ టీ 20లో టీమిండియా ఇంకా పూర్తిగా గాడిలో పడలేదనే చెప్పాలి.  ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన ట్వంటీ 20 సిరీస్ను,  ఆ తరువాత స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ను, బంగ్లాదేశ్లో జరిగిన ఆసియాకప్ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన భారత్.. వరల్డ్ టీ 20 వచ్చేసరికి మాత్రం జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదు.  ఈ టోర్నీలో న్యూజిలాండ్తో ఓటమి అనంతరం భారత్ సాధించిన రెండు విజయాలు స్థాయికి తగినవి ఎంతమాత్రం కావు.  పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు భారీ స్కోర్లు సాధించడానికి నానా తంటాలు పడుతుంది. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఉంది భారత జట్టు పరిస్థితి.  



వరల్డ్ కప్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ధోని సేన యావత్తు భారత అభిమానుల ఆశలను నిజం చేయాలంటే ఇకనైన బ్యాట్ ఝుళిపించక తప్పదు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్ను నిలువరించాలంటే భారత జట్టు అంచనాలను అందుకోవాలి. సమష్టిగా రాణిస్తేనే ఆసీస్పై విజయం సాధ్యమవుతుందని ధోని అండ్ గ్యాంగ్ గ్రహించాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top