హాకీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ గెలుపు | Hockey World League Semi-Finals: India Men Beat France 1-0 in First Practice Match | Sakshi
Sakshi News home page

హాకీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ గెలుపు

Jun 14 2015 2:04 AM | Updated on Sep 3 2017 3:41 AM

ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 1-0తో ఫ్రాన్స్‌పై గెలిచింది.

బెల్జియం: ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 1-0తో ఫ్రాన్స్‌పై గెలిచింది. రూపిందర్ పాల్ సింగ్ (23వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి రెండు జట్లు అటాకింగ్‌కు దిగాయి. తొలి క్వార్టర్స్‌లో వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నా... గోల్స్ చేయలేకపోయాయి. అయితే రెండో సెషన్‌లో భారత్ దూకుడును పెంచింది. ఈ క్రమంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ అద్భుతమైన గోల్‌గా మలిచాడు. తర్వాత స్కోరు సమం చేసేందుకు ఫ్రాన్స్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్... బెల్జియంతో తలపడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement