హిమదాస్‌కు స్వర్ణం  | Hima Das Wins 200m Gold In Poland | Sakshi
Sakshi News home page

హిమదాస్‌కు స్వర్ణం 

Jul 5 2019 9:45 AM | Updated on Jul 5 2019 9:45 AM

Hima Das Wins 200m Gold In Poland - Sakshi

న్యూఢిల్లీ : భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. పోలండ్‌లో జరుగుతున్న పోజ్నాన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిలో హిమ 200 మీటర్ల పరుగులో స్వర్ణం గెలుచుకుంది. ఆమె 23.65 సెకన్లలో రేసు పూర్తి చేసింది. భారత్‌కే చెందిన వీకే విస్మయ (23.75 సె.) కాంస్యం నెగ్గింది. పురుషుల షాట్‌పుట్‌లోనూ భారత్‌కు కాంస్యం లభించింది. తజీందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ (19.62 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల 200 మీటర్ల రేస్‌లో ముహమ్మద్‌ అనస్‌ (20.75 సె.), 400 మీటర్ల పరుగులో కేఎస్‌ జీవన్‌ (47.25 సె.)లకు  కాంస్య పతకాలు దక్కాయి.   

Advertisement
 
Advertisement
Advertisement