క్లాసెన్‌ అజేయ సెంచరీ

Heinrich Klaasen MAde A Century Against Australia - Sakshi

పార్ల్‌: హెన్రిచ్‌ క్లాసెన్‌ (114 బంతుల్లో 123 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ... డేవిడ్‌ మిల్లర్‌ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు, సిక్స్‌) బాధ్యతాయుత బ్యాటింగ్‌ కారణంగా... ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 74 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. క్లాసెన్, మిల్లర్‌ ఐదో వికెట్‌కు 149 పరుగులు జతచేసి తమ జట్టు భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ రెండు, కమిన్స్‌ మూడు వికెట్లు తీశారు. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 45.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (94 బంతుల్లో 76; 3 ఫోర్లు), లబ్‌షేన్‌ (51 బంతుల్లో 41; 2 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి (3/30), షమ్సీ (2/45) రాణించారు. క్లాసెన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం బ్లోమ్‌ఫోంటెన్‌లో జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top