హెచ్‌డీఏఏ అధ్యక్షుడిగా రాజేష్ | HDAA president Rajesh | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఏఏ అధ్యక్షుడిగా రాజేష్

Apr 30 2014 12:48 AM | Updated on Sep 2 2017 6:42 AM

హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ (హెచ్‌డీఏఏ) నూతన అధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బి.చంద్రభాస్కర్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ (హెచ్‌డీఏఏ) నూతన అధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బి.చంద్రభాస్కర్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి నియమితులయ్యారు. హెచ్‌డీఏఏ కార్యవర్గం సమావేశం మంగళవారం ఒలింపిక్ భవన్‌లో జరిగింది. ఈ కొత్త కార్యవర్గం 2018 వరకు కొనసాగుతుంది.
 
 కార్యవర్గం: ఎం.లక్ష్మణ్‌రెడ్డి(చీఫ్ ప్యాట్రన్), ఎ.నరసింహారెడ్డి (చైర్మన్), రాజేష్ కుమార్ (అధ్యక్షుడు), వై. శ్రీనివాస్‌రావు, ఎ.జేవియర్, టి.రమేష్ సింగ్, కె.లక్ష్మీపతి, ఎస్.జయరామ్, డి.వేణు గోపాల్ (వీరంతా ఉపాధ్యక్షులు), బి.చంద్ర భాస్కర్ (కార్యదర్శి), కె.ఎం. కిస్టీ (నిర్వాహక కార్యదర్శి), ఎస్,కె.మిశ్రా, బికాష్ కరార్, అమ్రాయిల్ సింగ్, కె.ప్రవీణ్ కుమార్, ఎం.ఎలీషా(సంయుక్త కార్యదర్శులు), ఎ.సోమేశ్వర్ రావు (కోశాధికారి). కార్యవర్గ సభ్యులుగా ఎం.బాబురావు, పి.అశోక్, వి.విజేందర్‌రెడ్డి, ఆదర్శ గోస్వామి, జి.బాలరాజ్, పి.నారాయణ, టి.ప్రేమావతి సింగ్, డాక్టర్ జె.సందీప్, పి. సాల్మాన్, జె.సంజీవ, సి.ఆర్.భీమ్ సింగ్, వెంకటేశ్వర్‌రావు, జి.ఎస్.ప్రభు కిరణ్, జె.మేషక్ బాబు, వి.రవీందర్ నియమితులయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement