హరికృష్ణ హ్యాట్రిక్‌ విజయం | Harikrishna Hattrick Win In The Second Round of The World Cup Chess Tournament | Sakshi
Sakshi News home page

హరికృష్ణ హ్యాట్రిక్‌ విజయం

Sep 14 2019 1:20 AM | Updated on Sep 14 2019 1:20 AM

Harikrishna Hattrick Win In The Second Round of The World Cup Chess Tournament - Sakshi

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ రెండో రౌండ్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణతోపాటు నిహాల్‌ సరీన్‌ గెలుపొందగా... విదిత్, ఆధిబన్‌ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మరోప్లేయర్‌ అరవింద్‌ చిదంబరం ఓడిపోయాడు. హరికృష్ణ 54 ఎత్తుల్లో వ్లాదిమిర్‌ ఫెడోసీవ్‌ (రష్యా)పై, నిహాల్‌ 37 ఎత్తుల్లో సఫార్లి ఎల్తాజ్‌ (అజర్‌బైజాన్‌)పై నెగ్గారు. నేడు హరికృష్ణ, నిహాల్‌ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంటే మూడో రౌండ్‌కు అర్హత పొందుతారు.  ఈ టోర్నీలో హరికృష్ణకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. విదిత్‌–రఖ్‌మనోవ్‌ (రష్యా) గేమ్‌ 31 ఎత్తుల్లో; ఆధిబన్‌–యు యాంగీ (చైనా) గేమ్‌ 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. అరవింద్‌ 37 ఎత్తుల్లో తొమవ్‌స్కీ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement