హారిక జట్టుకు టైటిల్‌ | harika team gets title | Sakshi
Sakshi News home page

హారిక జట్టుకు టైటిల్‌

Mar 19 2017 10:50 AM | Updated on Sep 5 2017 6:31 AM

హారిక జట్టుకు టైటిల్‌

హారిక జట్టుకు టైటిల్‌

పీఎస్‌పీబీ ఇంటర్‌ యూనిట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, లలిత్‌ బాబు ప్రాతినిధ్యం వహించిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) ‘ఎ’ జట్టు సత్తా చాటింది.

చెన్నై: పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ) ఇంటర్‌ యూనిట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, లలిత్‌ బాబు ప్రాతినిధ్యం వహించిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌  (ఐఓసీఎల్‌) ‘ఎ’ జట్టు సత్తా చాటింది. టీమ్‌ విభాగంలో మొత్తం 11 జట్లు తలపడిన ఈ టోర్నీలో ఐఓసీఎల్‌ ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచింది.

 

సూర్య శేఖర గంగూలీ, ఆధిబన్, హారిక, లలిత్‌బాబు, అభిజిత్‌ కుంతేలతో కూడిన ఐఓసీఎల్‌ ‘ఎ’ జట్టు 20 పాయింట్లను సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత ఐఓసీఎల్‌ జట్టు ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. హారిక తొలిసారిగా పీఎస్‌పీబీ టోర్నీలో ఆడింది. టీమ్‌ విభాగంలో లలిత్‌ బాబు 5.5 పాయింట్లు సాధించగా... హారిక, ఆధిబన్‌ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. గంగూలీ 3.5, అభిజిత్‌ 3 పాయింట్లను సాధించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement