రెండో గేమ్‌లో హారిక ఓటమి | Harika defeat in the second game | Sakshi
Sakshi News home page

రెండో గేమ్‌లో హారిక ఓటమి

Feb 22 2017 1:28 AM | Updated on Sep 5 2017 4:16 AM

రెండో గేమ్‌లో హారిక ఓటమి

రెండో గేమ్‌లో హారిక ఓటమి

ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తొలి పరాజయాన్ని చవిచూసింది.

టెహరాన్‌: ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తొలి పరాజయాన్ని చవిచూసింది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకునే క్రమంలో ఒక్క గేమ్‌ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోని హారిక జోరుకు జార్జియా క్రీడాకారిణి నానా జాగ్‌నిద్జె చెక్‌ పెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ రెండో గేమ్‌లో హారిక నల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో నానా జాగ్‌నిద్జె చేతిలో ఓటమి పాలైంది.

నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత చెరో విజయంతో హారిక, నానా జాగ్‌నిద్జె 1–1తో సమంగా ఉన్నారు. దాంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు బుధవారం టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహిస్తారు. టైబ్రేక్‌లో గెలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement