హారికకు మరో ‘డ్రా’ | Harika another 'draw' | Sakshi
Sakshi News home page

హారికకు మరో ‘డ్రా’

Nov 27 2016 11:35 PM | Updated on Sep 4 2017 9:17 PM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’ల పర్వం

ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’ల పర్వం కొనసాగుతోంది. లెలా జవఖిష్‌విలి (జార్జియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హారిక 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హారికకిది వరుసగా నాలుగో ‘డ్రా’కాగా... టోర్నీలో ఓవరాల్‌గా ఆరోది. ఎనిమిదో రౌండ్ తర్వాత హారిక నాలుగు పారుుంట్లతో ఏడో స్థానంలో ఉంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement