'హర్భజన్, గీతల పెళ్లికి రండి' | Harbhajan Singh, Geeta Basra Gear Up for Wedding, Click Here for Invite | Sakshi
Sakshi News home page

'హర్భజన్, గీతల పెళ్లికి రండి'

Oct 3 2015 6:35 PM | Updated on Sep 3 2017 10:23 AM

'హర్భజన్, గీతల పెళ్లికి రండి'

'హర్భజన్, గీతల పెళ్లికి రండి'

ప్రేమపక్షులు క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ భామ గీతా బస్రా పెళ్లి తేదీ ఎట్టకేలకు నిశ్చయమైంది.

న్యూఢిల్లీ:  ప్రేమపక్షులు క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ భామ గీతా బస్రా పెళ్లి తేదీ ఎట్టకేలకు నిశ్చయమైంది. వాయిదాలు పడుతూ వస్తున్న వివాహ తేదీని ఖరారు చేశారు. ఈ నెల 29న హర్భజన్, గీత వివాహం జరగనుంది. నవంబర్ 1న రిసెప్షన్. ఈ మేరకు ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు.

భజ్జీ, గీతల వివాహ ఆహ్వాన పత్రికను డిజైనర్ ఏడీ సింగ్ రూపొందించారు. ఈ వివాహ పత్రికను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హర్భజన్ సొంతూరైన పంజాబ్లోని జలంధర్కు 20 కిలో మీటర్ల దూరంలోని ఓ హోటల్లో జరగనుంది. సంగీత్, మెహంది, రిసెప్షన్లతో సహా పెళ్లి వేడుకలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. పెళ్లి రోజున గీత గాగ్రా, హర్భజన్ షేర్వానీలతో మెరిసిపోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement