సిరాజ్‌, విహారీలకు నిరాశే! | Hanuma Vihari And Siraj Sit Out For IND vs WI First Test  | Sakshi
Sakshi News home page

Oct 3 2018 12:54 PM | Updated on Oct 3 2018 4:30 PM

Hanuma Vihari And Siraj Sit Out For IND vs WI First Test  - Sakshi

మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారి

భారత జట్టుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారీలకు..

రాజ్‌కోట్‌ : వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారీలకు నిరాశే ఎదరురైనట్లు తెలుస్తోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ఈ ఇద్దరి ఆటగాళ్లకు తుది జట్టులో చోటుదక్కలేదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు జాబితా ప్రస్తుతం వైరల్‌ అయింది. ఇంగ్లండ్‌ పర్యటనలోనే అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన హనుమ విహారి కూడా బెంచ్‌కే పరిమితమైనట్లు తెలుస్తోంది. లోయరార్డర్‌తో సమన్వయం చేసుకుంటూ జట్టుకు అవసరమైన పరుగులు జోడించడం నంబర్‌ 6 బ్యాట్స్‌మన్‌ కర్తవ్యం. ఈ బాధ్యతను నిర్వర్తించేవారు లేకే ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌ టెస్టులను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఆ సిరీస్‌లో ఐదో టెస్టు ఆడిన హనుమ విహారి ఆరో నంబరుకు తగినవాడిగా ఆశలు రేపాడు. బ్యాటింగ్‌లో అర్ధ శతకంతో పాటు ఉపయుక్తమైన ఆఫ్‌ స్పిన్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇదే అతన్ని మళ్లీ జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. 

ఇక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శనతో మరోసారి సెలెక్టర్లను దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు సైతం రేపటి మ్యాచ్‌లో చోటు దక్కలేదని సమాచారం. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయాలనుకున్న సిరాజ్‌కు నిరాశే మిగిలింది. అయితే ఈ ఇద్దరి ఆటగాళ్లను అక్టోబర్‌ 12 నుంచి హైదరాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌కు ఎంపిక చేయాలనే యోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపటి మ్యాచ్‌తో అండర్‌-19 సూపర్‌ హీరో పృథ్వీషా అరంగేట్రం చేయనున్నాడని స్పష్టమైంది. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ఇప్పటికే పృథ్వీషా అరంగేట్రంపై హింట్‌ ఇచ్చాడు. ఇక సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న జాబితాలో సైతం పృథ్వీ షా పేరుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement