ఏబీ సెన్సేషనల్‌ క్యాచ్‌

Hales dismissed by ab sensational catch - Sakshi

బెంగళూరు: ప్రపంచ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌ది ప్రత్యేకస్థానం. బ్యాట్స్‌మన్‌గానే కాదు.. కీపర్‌గా, ఫీల్డర్‌గా చెరగని ముద్ర అతని సొంతం. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో మెరిసిన డివిలియర్స్‌.. ఆపై అద్భుతమైన క్యాచ్‌ను పట్టి ఫీల్డింగ్‌లో కూడా తనదైన మార్కును మరోసారి చూపెట్టాడు.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ బౌలర్‌ మొయిన్‌ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌ ఆఖరి బంతిని అలెక్స్‌ హేల్స్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న డివిలియర్స్‌ గాల్లో అమాంతం ఎగిరి క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. ఆ క‍్రమంలోనే బౌండరీ లైన్‌ తాకకుండా తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఏబీ సెన్సేషనల్‌ క్యాచ్‌తో చిన్నస్వామి స్టేడియం మార్మోగిపోయింది.  ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏబీ డివిలియర్స్‌(69;39 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌), మొయిన్‌ అలీ(65;34బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)లు చెలరేగి ఆడగా, గ్రాండ్‌ హోమ్ ‌(40; 17 బంతుల్లో1 ఫోర్‌, 4 సిక్సర్లు‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరకు నమోదు చేసింది.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top