ఆర్‌బీఐపై హెచ్‌ఏఎల్ గెలుపు | HAAL won with RBI Team | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐపై హెచ్‌ఏఎల్ గెలుపు

Aug 1 2014 11:44 PM | Updated on Oct 2 2018 8:39 PM

సి-డివిజన్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంట్‌లో హెచ్‌ఏఎల్ జట్టు 6-0 గోల్స్‌తో ఆర్‌బీఐ జట్టుపై విజయం సాధించింది.

సి-డివిజన్ ఫుట్‌బాల్ లీగ్
 ఎల్బీ స్టేడియం: సి-డివిజన్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంట్‌లో హెచ్‌ఏఎల్ జట్టు 6-0  గోల్స్‌తో ఆర్‌బీఐ జట్టుపై విజయం సాధించింది. తిరుమలగిరి విలేజ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో హెచ్‌ఏఎల్ జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది.  రాహుల్, ఇమాన్యుయెల్, డెంజిల్, గణేష్, కార్తీక్, శరత్‌లు తలా ఒక గోల్స్ చేశారు.  ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఎయిరిండియా, సోషల్ స్పోర్టింగ్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.

శనివారం ఓయూ మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో ఏకే స్పోర్టింగ్ క్లబ్‌తో సీసీఓబీ (జూనియర్) తలపడుతుంది. జింఖానా మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్‌తో సికింద్రాబాద్ బ్లూస్, అలాగే తిరుమలగిరి విలేజ్ మైదానంలో జరిగే మ్యాచ్‌లో కంటోన్మెంట్ ఫుట్‌బాల్ క్లబ్‌తో హెచ్‌ఏఎల్ ఢీకొంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement