హంపి, హారిక శుభారంభం | good start for humpy and harika | Sakshi
Sakshi News home page

హంపి, హారిక శుభారంభం

Mar 18 2015 12:58 AM | Updated on Sep 2 2017 10:59 PM

హంపి, హారిక శుభారంభం

హంపి, హారిక శుభారంభం

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు.

సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు. అయా మొతాజ్ (ఈజిప్టు)తో మంగళవారం జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో టాప్ సీడ్ హంపి 31 ఎత్తుల్లో విజయం సాధించగా... హారిక 57 ఎత్తుల్లో తతేవ్ అబ్రహమియాన్ (అమెరికా)ను ఓడించింది.

తొలి రౌండ్ ప్రత్యర్థులతోనే బుధవారం జరిగే రెండో గేమ్‌ను హంపి, హారిక కనీసం ‘డ్రా' చేసుకున్నా రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం గురువారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. మేరీ ఆన్ గోమ్స్ (భారత్), తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా)ల మధ్య జరిగిన మరో తొలి రౌండ్ గేమ్ 80 ఎత్తుల్లో ‘డ్రా'గా ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement