అంధుల క్రికెట్‌కూ గుర్తింపు ఇవ్వండి | Give the blind cricket of the blind | Sakshi
Sakshi News home page

అంధుల క్రికెట్‌కూ గుర్తింపు ఇవ్వండి

Feb 8 2018 1:25 AM | Updated on Feb 8 2018 10:18 AM

Give the blind cricket of the blind - Sakshi

సచిన్‌

న్యూఢిల్లీ: ‘అంధుల జట్టు ఎన్నో అవరోధాలు అధిగమించింది. వారి స్ఫూర్తిదాయక ప్రపంచకప్‌ విజయం మానవ మేధస్సుకు పరిమితి లేదని గుర్తుచేస్తోంది. అందుకని భారత అంధుల క్రికెట్‌ సంఘం (సీఏబీఐ)కు గుర్తింపునిస్తూ ఆ క్రికెటర్లను బోర్డు పెన్షన్‌ పథకం పరిధిలోకి తీసుకోండి’ అని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ బీసీసీఐని కోరాడు.

ఈ మేరకు బోర్డు పరిపాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్‌రాయ్‌కు లేఖ రాశాడు. బీసీసీఐ గుర్తింపు దక్కడం వారి కృషికి మెచ్చుకోలుగా ఉంటుందని, ఆటగాళ్ల ఆర్థిక భద్రతకూ భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నా డు. గత నెలలో అంధుల జట్టు ప్రపంచకప్‌ గెలిచిన సందర్భంగా బీసీసీఐ తరఫున రివార్డు అందిస్తామని రాయ్‌ ప్రకటించారు.   

Advertisement
 
Advertisement
Advertisement