నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్‌

GayleGayle dedicated His IPL 2018 First Century To His Daughter - Sakshi

మొహాలి : క్రిస్‌ గేల్‌ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఐపీఎల్‌- 2018 లో మొదటి సెంచరీని గేల్‌ సాధించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గేల్‌ విధ్వంసం సృష్టించాడు. గేల్‌ 1 ఫోర్‌, 11 సిక్స్‌లతో 63బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో సెంచరీ అనంతరం తనదైన రీతిలో గేల్‌ బ్యాట్‌తో సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ఈ రోజు(శుక్రవారం)  గేల్‌ కుమార్తె క్రిసాలినా పుట్టిన రోజు. నిన్న మ్యాచ్‌లో సాధించిన సెంచరీని గేల్ తన కుమార్తె క్రిసాలినాకు పుటినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు గేల్‌ను వరించింది. అనంతరం క్రిస్‌ గేల్ మాట్లాడుతూ.. ‘నా సెంచరీని నా కుమార్తె క్రిసాలినాకు అంకితం ఇస్తున్నాను. శుక్రవారం(ఏఫ్రిల్‌ 20న) మా రెండో పాట పుట్టినరోజును జరుపుకుంటోంది. క్రిసాలినా ఇండియాకు రావడం రెండోసారి. పంజాబ్‌ టీమ్‌ హోమ్‌గ్రౌండ్‌లో సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంద’ని గేల్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 15 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన విషయం విదితమే.

టి20లో గేల్ మొత్తం 21 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత మెకల్లమ్‌, క్రింగర్‌, ల్యూక్ రైట్‌ 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డుని (6 సెంచరీలు) తన పేర లిఖించుకున్నాడు ఈ విండీస్‌ వీరుడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top