గంభీర్‌ గుడ్‌బై 

Gautam Gambhir Retires From All Forms of Cricket After 15-Year-Long Career - Sakshi

రిటైర్మెంట్‌ ప్రకటించిన ఓపెనర్‌

ఆంధ్రతో రంజీ మ్యాచ్‌ చివరిది   

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌లో విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న గౌతం గంభీర్‌ ఆటకు గుడ్‌బై చెప్పాడు. తాను అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు అతను మంగళవారం ప్రకటించాడు. ఈ నెల 6 నుంచి సొంత మైదానం ఫిరోజ్‌షా కోట్లాలో ఆంధ్ర జట్టుతో జరిగే రంజీ మ్యాచ్‌లో తాను ఆఖరి సారిగా బరిలోకి దిగుతానని 37 ఏళ్ల గంభీర్‌ వెల్లడించాడు. 2003లో ఏప్రిల్‌లో తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన గంభీర్‌... 2016 నవంబర్‌లో రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై తన ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అతని టి20 కెరీర్‌ 2012లో, వన్డే కెరీర్‌ 2013లోనే ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేలకు పైగా పరుగులు చేసిన గంభీర్‌ తన వీడ్కోలుపై... ‘రిటైర్మెంట్‌ గురించి ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నాను.

గంభీర్‌ పనైపోయిందనే వ్యాఖ్యలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. 2018 ఐపీఎల్‌లో వైఫల్యం తర్వాత ఈ మాటల దాడి మరింత పెరిగింది. అందుకే 15 ఏళ్ల పాటు ఆడిన తర్వాత నాకెంతో ఇష్టమైన ఆటకు గుడ్‌బై చెబుతున్నాను. నా కెరీర్‌ పూర్తిగా సంతృప్తినిచ్చిందని చెప్పలేను. ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని మాత్రం భావిస్తున్నా. రెండు ప్రపంచకప్‌లు, రెండు ఫైనల్స్‌లోనూ అత్యధిక స్కోరు చూస్తే కలలు నిజమైనట్లుగా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top