గౌస్ హ్యాట్రిక్ స్పోర్టింగ్ జయభేరి | Gauss hatrick | Sakshi
Sakshi News home page

గౌస్ హ్యాట్రిక్ స్పోర్టింగ్ జయభేరి

Aug 6 2014 12:00 AM | Updated on Oct 2 2018 8:39 PM

సి-డివిజన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ 5-0 గోల్స్‌తో సీసీఓబీ జూనియర్ జట్టుపై ఘనవిజయం సాధించింది.

 సి-డివిజన్ ఫుట్‌బాల్ లీగ్
 ఎల్బీ స్టేడియం: సి-డివిజన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ 5-0 గోల్స్‌తో సీసీఓబీ జూనియర్ జట్టుపై ఘనవిజయం సాధించింది. స్పోర్టింగ్ ఆటగాడు గౌస్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ ఆటగాళ్లు కదం తొక్కారు.
 
  రెహ్మాన్, అబ్బాస్ తలా ఒక గోల్ చేశారు. తిరుమలగిరి విలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో సచ్‌దేవ్ ఐడీఎల్ జట్టు 6-0 గోల్స్ తేడాతో సికింద్రాబాద్ బ్లూస్ (బి)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో జయుడు రెండు గోల్స్, క్యానీ, షాన్, రోహిత్, ఉదయ్‌లు తలా ఒక గోల్ చేశారు.  జింఖానా మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సుసాయి సీనియర్ జట్టు 2-1తో ఓకే స్పోర్టింగ్ క్లబ్ జట్టును ఓడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement