ఆ టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యింది! | Former Indian team manager claims India-England 2014 Test was fixed | Sakshi
Sakshi News home page

ఆ టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యింది!

Feb 8 2016 2:49 PM | Updated on Sep 3 2017 5:11 PM

ఆ టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యింది!

ఆ టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యింది!

దాదాపు ఏడాదిన్నర క్రితం మాంచెస్టర్ లో టీమిండియా- ఇంగ్లండ్ ల మధ్య జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యిందనే ఆరోపణలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి.

న్యూఢిల్లీ: దాదాపు ఏడాదిన్నర క్రితం మాంచెస్టర్ లో టీమిండియా- ఇంగ్లండ్ ల మధ్య జరిగిన  నాల్గో టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యిందనే ఆరోపణలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మ్యాచ్ లో  ఫిక్సింగ్  జరిగిందంటూ ఆనాటి టీమిండియా క్రికెట్ మేనేజర్, ఇప్పటి డిల్లీ, ఢిల్లీ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ సునీల్ దేవ్ వెల్లడించిన విషయం ఆదివారం హిందీ డైలీ సన్ స్టార్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది. ఆ మ్యాచ్ లో  బౌలింగ్ కు పరిస్థితులు అనుకూలంగా ఉంండగా  టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మొత్తం జట్టును ఆశ్చర్యానికి గురి చేయగా, ఆ తరువాత భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమి పాలుకావడంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనడానికి మరింతబలాన్నిచ్చిందని తెలిపాడు.

 

తొలిరోజు బౌలింగ్ కు వందశాతం కచ్చితంగా అనుకూలిస్తుందని తెలిసినా, ధోని బ్యాటింగ్ తీసుకోవడం అందర్నీ డైలమాలో పాడేసిందన్నాడు. అంతకుముందు జరిగిన బోర్డు సమావేశంలో కూడా టాస్ గెలిస్తే తొలుత ఫీల్డింగ్ తీసుకోవాలని అనుకున్నట్లు సునీల్ దేవ్ తెలిపాడు. ఈ విషయాల్ని వీడియో రూపంలో బయటకు రావడంతో ఆ వార్త ఇప్పడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఇదిలా ఉండగా, ఆ ఆరోపణల్ని సునీల్ దేవ్ ఖండిస్తున్నాడు. ఆ వీడియోకి తనకు ఎటువంటి సంబంధలేదని పేర్కొన్నాడు. తనపై ఆరోపణలు చేసిన ఆ హిందీ డైలీపై చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. 2014లో టీమిండియా-ఇంగ్లండ్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే.  ఈ సిరీస్ ను ఇంగ్లండ్ 3-1తేడాతో గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement