రోజర్‌ ఫెడరర్‌... టైటిల్‌ నంబర్‌ 99 | Federer wins 99th title, beats Copil in Swiss Indoors final | Sakshi
Sakshi News home page

రోజర్‌ ఫెడరర్‌... టైటిల్‌ నంబర్‌ 99

Oct 29 2018 5:40 AM | Updated on Oct 29 2018 5:40 AM

Federer wins 99th title, beats Copil in Swiss Indoors final - Sakshi

స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తన కెరీర్‌లో 99వ సింగిల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన స్విస్‌ ఓపెన్‌ టోర్నీలో అతను తొమ్మిదోసారి విజేతగా నిలిచాడు. ఫైనల్లో 37 ఏళ్ల ఫెడరర్‌ 7–6 (7/5), 6–4తో కోపిల్‌ (రొమేనియా) పై నెగ్గాడు. గతంలో ఫెడరర్‌ 2006, 07, 08, 10, 11, 14, 15, 2017లలో ఈ టోర్నీని గెలిచాడు. చాంపియన్‌  ఫెడరర్‌కు 4,27,765 యూరోలు (రూ. 3 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెడరర్‌ మరో టైటిల్‌ గెలిస్తే... జిమ్మీ కానర్స్‌ (109 టైటిల్స్‌–అమెరికా) తర్వాత 100 టైటిల్స్‌ నెగ్గిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement