ధోని మ్యాచ్కు ఫ్రీ ఎంట్రీ! | Fans allowed free entry for tour match with Dhoni leading India A | Sakshi
Sakshi News home page

ధోని మ్యాచ్కు ఫ్రీ ఎంట్రీ!

Jan 10 2017 10:48 AM | Updated on Sep 5 2017 12:55 AM

ధోని మ్యాచ్కు ఫ్రీ ఎంట్రీ!

ధోని మ్యాచ్కు ఫ్రీ ఎంట్రీ!

ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని వైదొలిగిన సంగతి తెలిసిందే.

ముంబై:ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని వైదొలిగిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధోని తన కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పాడు. అయితే ధోని గౌరవార్థం ఒక మ్యాచ్లో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కల్పించింది. ఈ మేరకు ఈరోజు (మంగళవారం)నుంచి నగరంలోని బ్రాబోర్న్ స్టేడియంలో మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి ఇంగ్లండ్తో జరిగే భారత్ -ఎ జట్టుకు ధోని చివరగా సారథ్యం వహించనున్నాడు.

 

దీనిలో భాగంగా ఆ మ్యాచ్కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన తరువాత కూడా అభిమానుల్ని ఫ్రీగా స్టేడియంలోకి పంపిచనున్నట్లు తెలిపింది. ఒకవేళ తొలిరోజు ఆటలో భాగంగా మధ్యాహ్నం గం.3.00 ని.లకు వారికి కేటాయించిన నార్త్, ఈస్ట్ స్టాండ్స్ నిండిపోయినట్లయితే గేట్లను మూసివేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement