ఎవర్‌గ్రీన్‌ ఇన్నింగ్స్‌ విజయం

Evergreen Cricket Team Beat India Cements By Innings 96 Runs - Sakshi

ఇండియా సిమెంట్స్‌ ఓటమి

మూడు రోజుల క్రికెట్‌ లీగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎ–1 డివిజన్‌ మూడు రోజుల     క్రికెట్‌ లీగ్‌లో ఎవర్‌గ్రీన్‌ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండియా సిమెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవర్‌గ్రీన్‌ ఇన్నింగ్స్‌ 96 పరుగులతో గెలుపొందింది. ఓవర్‌నైట్‌ స్కోరు 93/3తో గురువారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఎవర్‌గ్రీన్‌ 73.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఎవర్‌గ్రీన్‌ జట్టుకు 243 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. బి.మనోజ్‌ కుమార్‌ (75), జి. అనికేత్‌ రెడ్డి (79) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇండియా సిమెంట్స్‌ 33.1 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మొహమ్మద్‌ ఒమర్‌ (57 నాటౌట్‌) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో వంశీకృష్ణ 4, శ్రవణ్‌ 6   వికెట్లతో జట్టును గెలిపించారు. ఇన్నింగ్స్‌ విజయం సాధించిన ఎవర్‌గ్రీన్‌ జట్టుకు 7 పాయింట్లు లభించాయి. 

ఇతర మ్యాచ్‌ల వివరాలు  
జై హనుమాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 283 (73.2 ఓవర్లలో), స్పోర్టింగ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 292 (ఫైజల్‌ 61, యుధ్‌వీర్‌ సింగ్‌ 62; శ్రవణ్‌ 5/50), జై హనుమాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 92/2 (అనురాగ్‌ 31 బ్యాటింగ్‌). 
ఆర్‌. దయానంద్‌ తొలి ఇన్నింగ్స్‌: 291 (ఆకాశ్‌ భండారి 7/95), ఎస్‌బీఐ తొలి ఇన్నింగ్స్‌: 265/5 (అనిరుధ్‌ సింగ్‌ 54, డానీ డెరెక్‌ 74, బి. సుమంత్‌ 53 బ్యాటింగ్‌). 
ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్‌: 151 (51.2 ఓవర్లలో), ఆంధ్రా బ్యాంక్‌ తొలి ఇన్నింగ్స్‌: 167 (అమోల్‌ షిండే 58; సురేశ్‌ 5/56), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ రెండో ఇన్నింగ్స్‌: 97 (హితేశ్‌ యాదవ్‌ 6/37), ఆంధ్రా బ్యాంక్‌ రెండో ఇన్నింగ్స్‌: 85/1 (రోనాల్డ్‌ 47 నాటౌట్‌).  
ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌: 303 (సాయి అభినయ్‌ 92; రాజు 6/58), ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 343 (హర్షవర్ధన్‌ 96, చరణ్‌ 74, సందీప్‌ 79).  
డెక్కన్‌ క్రానికల్‌ తొలి ఇన్నింగ్స్‌: 238 (వరుణ్‌ గౌడ్‌ 102, మిలింద్‌ 58; ముదస్సిర్‌ 7/83), బీడీఎల్‌ తొలి ఇన్నింగ్స్‌: 176/4 (సింహా 70 బ్యాటింగ్, సంతోష్‌ గౌడ్‌ 50).  
ఎన్స్‌కాన్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 381 (ఒవైస్‌ 140 నాటౌట్‌; ఆశిష్‌ 6/111), కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌: 181/4 (పి. నితీశ్‌ రాణా 65). 
ఎంపీ కోల్ట్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 635/9 (మికిల్‌ జైస్వాల్‌ 186, శిరీష్‌ 52, నిఖిల్‌ 100 నాటౌట్, గిరీశ్‌ 52; అలీమ్‌ 5/183), కాంటినెంటల్‌ తొలి ఇన్నింగ్స్‌: 74/4 (28 ఓవర్లలో).  
హైదరాబాద్‌ బాట్లింగ్‌ తొలి ఇన్నింగ్స్‌: 170 (శ్రీచరణ్‌ 63, తాహా షేక్‌6/48), జెమినీ ఫ్రెండ్స్‌: 135 (అభిరత్‌ రెడ్డి 79 బ్యాటింగ్‌).  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top